ఇప్పటివరకు ‘కబీర్ సింగ్’ నే నెంబర్ వన్.

Published on Aug 6, 2019 8:03 pm IST

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కొద్దిసేపటి క్రితం బాలీవుడ్ లో 2019 సంవత్సరానికి ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన పది చిత్రాల లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టులో స్టార్ హీరోల చిత్రాలను కూడా వెనక్కినెడుతూ షాహిద్ కపూర్ లేటెస్ట్ సెన్సేషన్ “కబీర్ సింగ్” మొదటి స్థానంలో నిలచింది. దాదాపు 280కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన “కబీర్ సింగ్” మొదటిస్థానం దక్కించుకొంది.

భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కిన “ఉరి” చిత్రం దీని తరువాత స్థానంలో నిలువగా, స్టార్ హీరో సల్మాన్ రంజాన్ కానుకగా విడుదల చేసిన “భారత్” చిత్రం మూడవ స్థానం నిలవడం గమనార్హం. ఇక అక్షయ్ నటించిన “కేసరి” నాలుగవ, అజయ్ దేవగణ్ “టోటల్ ఢమాల్” ఐదవ స్థానంలో నిలిచాయి. రణ్వీర్ సింగ్ నటించిన “గల్లీ బాయ్” చిత్రం టాప్ ఫైవ్ లోకూడా చోటు సంపాదించలేకపోవడం గమనార్హం. హృతిక్ లేటెస్ట్ మూవీ “సూపర్ 30” ఆరవ స్థానంలో నిలిచిననప్పటికీ ఇంకా వసూళ్లు కొనసాగడంతో ఈ చిత్రం ఒకటి,రెండు స్థానాలు మెరుగుపరచుకునే అవకాశం కలదు.
2019గాను ఇప్పటివరకు బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు
1.కబీర్ సింగ్(షాహిద్ కపూర్)
2. ఉరి (విక్కీ కౌశల్)
3. భారత్ (సల్మాన్ ఖాన్)
4. కేసరి( అక్షయ్ కుమార్)
5. టోటల్ ఢమాల్ (అజయ్ దేవగణ్)
6. సూపర్ 30 (హృతిక్ రోషన్)
7. గల్లీ బాయ్ (రణ్వీర్ సింగ్)
8. దే దే ప్యార్ దే (అజయ్ దేవగణ్)
9. మణికర్ణిక (కంగనా రనౌత్)
10. లూకా ఛుప్పి(కృతి సనాన్)

సంబంధిత సమాచారం :