అక్కడ “కబ్జ” షోస్ క్యాన్సిల్.?

Published on Mar 16, 2023 12:01 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ సినిమాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మరో పాన్ ఇండియా సినిమా “కబ్జ” కూడా ఒకటి. మరి దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఉపేంద్ర హీరోగా కిచ్చా సుదీప్ ఓ కీలక పాత్రలో నటించారు. మరి తెలుగులో కూడా డీసెంట్ అంచనాలు ఉన్న ఈ చిత్రం అయితే రేపు మార్చ్ 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ సినిమాకి ఇప్పుడు రిలీజ్ చిక్కులు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇండియా లో అయితే అన్ని భాషల్లో పర్వాలేదు కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం కబ్జ షో లు ఆగిపోనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అక్కడికి కంటెంట్ డెలివరీ కాకపోవడం మూలాన అయితే ప్రీమియర్ షో లు పడే ఛాన్స్ లేనట్టుగా తెలుస్తుంది. దీనితో అక్కడ కూడా శుక్రవారం నుంచే సినిమా పడనుంది అని టాక్.

సంబంధిత సమాచారం :