నెగిటివ్ రోల్ లో స్టార్ హీరోయిన్ !

Published on Dec 30, 2018 2:00 am IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం యంగ్ హీరోలతో సినిమాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆమె తేజ దర్శకత్వంలో యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ ప్రతినాయకురాలి గా సీత అనే పాత్రలోనటిస్తున్నట్లు సమాచారం. కథ అంత ఆమె చుట్టే తిరిగేది కావడంతో ఆ రోల్ ఈ చిత్రానికి కీలకం కానుందట. కాగా ఈచిత్రానికి సీత అనే టైటిల్ కూడా ప్రచారంలో వుంది. మరి నెగిటివ్ రోల్ లో కాజల్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కాజల్ కు ఇది రెండవ చిత్రం ఇటీవల వీరిద్దరు కలిసి నటించిన ‘కవచం’ పరాజయాన్ని చవిచూసింది. అలాగే దర్శకుడు తేజ తో కాజల్ కుఇది నాల్గవ చిత్రం. ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో ‘చందమామ , లక్ష్మి కళ్యాణం , నేనేరాజు నేనేమంత్రి’ చిత్రాల్లో నటించింది.

సంబంధిత సమాచారం :