స్పెషల్ రోల్ లో కాజల్ !

Published on May 19, 2019 12:11 pm IST

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న సినిమా ‘సీత’. మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం. అయితే సినిమాలో కాజల్ రోల్ కొంత వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నా టాప్ హీరోస్ అందరితో ఆడిపాడింది కాజల్ అగర్వాల్. కానీ ఇంతవరకు సీత లాంటి పాత్రలో నటించలేదట. ఈ సినిమాలోని సీత పాత్ర కాజల్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలుస్తోందని తెలుస్తోంది.

ఇక ఇటీవలే దర్శకుడు తేజ ‘సీత’ గురించి మాట్లాడుతూ.. ఈ కథ కాజల్ అగర్వాల్ కు కొన్ని సంవత్సరాల క్రితమే తెలుసు. తను అప్పటి నుంచీ ఈ కథ నాతోనే చెయ్యాలని పట్టుబట్టింది. కాజల్ ఇంట్రస్ట్ ను చూసి కాజల్ నే హీరోయిన్ గా ఫైనల్ చేశాను. కానీ హీరోయిన్ గా కాజల్ యాక్ట్ చేస్తోంది అనే సరికి.. కథ నచ్చినా కొంతమంది హీరోలు అంగీకరించలేదు. కథ మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుంది.. అందుకే వాళ్ళు ఒప్పుకోలేదని తేజ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన కెరీర్ లోనే ఓ స్పెషల్ రోల్ కాజల్ నటిస్తోందన్నమాట.

ఈ సినిమాలో సోనూసూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More