స్క్రిప్ట్ ఇష్యూతో ఆ సినిమాలో నటించలేదు – కాజల్ అగర్వాల్

స్క్రిప్ట్ ఇష్యూతో ఆ సినిమాలో నటించలేదు – కాజల్ అగర్వాల్

Published on Feb 4, 2015 2:57 PM IST

Kajal

‘టెంపర్’ సినిమా షూటింగ్ బిజీలో డేట్స్ అడ్జస్ట్ చేయలేక కాదు, స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాను అని చెప్పింది కాజల్ అగర్వాల్. ఇంతకు ఈ కలువ కళ్ళ భామ ఎ సినిమా గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా..? సుదీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ సినిమా ‘ఔర్ దేవదాస్’ గురించి. ‘టెంపర్’ బిజీ షెడ్యూల్లో డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేక ‘ఔర్ దేవదాస్’లో నటించే అవకాశాన్ని కాజల్ వదులుకుందని ప్రచారం జరిగింది. దీనిపై కాజల్ క్లారిటీ ఇచ్చింది.

‘టెంపర్’, ‘ఔర్ దేవదాస్’ సినిమాలలో నటించడానికి నా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను. అయితే, ‘ఔర్ దేవదాస్’ స్క్రిప్ట్ విషయంలో ఇష్యూల వల్ల.. అందులో నటించలేదు. నటిగా నాకు నేనుగా కొన్ని పరిమితులు విధించుకున్నాను. వాటిని క్రాస్ చేయాలని అనుకోవడం లేదు. అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ముచ్చటగా మూడోసారి నటించిన ‘టెంపర్’, ఫిబ్రవరి 13న విడుదలవుతుంది. ఈ సినిమాలో కాజల్ అల్ట్రా గ్లామరస్ గా కనిపించనుంది.

తాజా వార్తలు