పెళ్ళికి సిద్ధంగానే ఉన్నానంటున్న కాజల్ !
Published on Feb 21, 2018 5:06 pm IST

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడ ఒకరు. 2016లో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఈమె నటించిన ‘అ !’ చిత్రానికిగాను మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి విభిన్నమైన సినిమాలే మరిన్ని చేస్తానంటున్న కాజల్ ప్రేమకు తానెప్పుడూ సిద్ధమేనంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

ప్రముఖ దినపత్రికతో ముచ్చటించిన ఆమె ప్రేమ, పెళ్లి నా సినిమాలకు ఇబ్బంది అని నేనెప్పుడూ అనుకోలేదు. జీవితంలోకి వాటిని ఎప్పుడూ ఆహ్వానిస్తాను. నా సోదరి కూడ వివాహం చేసుకుని సంతోషంగా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడ సరైన వ్యక్తిని ఎంచుకోమని చెబుతున్నారు అంటూ ప్రేమ, పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలియజెప్పారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఏ’, ‘క్వీన్’ తమిళ్ రీమేక్ ‘పారిస్ పారిస్’ లో నటిస్తున్న ఈ భామ త్వరలో ప్రారంభంకానున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సైతం నటించనుంది.

 
Like us on Facebook