‘దువ్వాడ జగన్నాథం’ తో జతకట్టనున్న కాజల్

kajal
‘సరైనోడు’ చిత్రంతో ఈ సంవత్సరం అతి పెద్ద హిట్ ను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే – దువ్వాడ జగన్నాథం’ అనే కొత్త సినిమాను ప్రారంభించాడు. ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇకపోతే ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు.

గతంలో బన్నీతో కలిసి ‘ఆర్య-2, ఎవడు’ వంటి చిత్రాల్లో నటించిన కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైధీ నెం.150’ లో కూడా నటిస్తోంది. ఇకపోతే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ ఆయాంకా బోస్ పనిచేయన్నారు. ఈ చిత్రాన్ని 2017 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.