సీత మీద హోప్స్ పెట్టుకున్న కాజల్ !

Published on May 15, 2019 4:10 pm IST

పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దం దాటినా కాజల్ అగర్వాల్ ఇంకా తన హవాను కొనసాగిస్తోంది. దాదాపు అందరు సౌత్ స్టార్ హీరోల సరసన నటించేసిన ఆమె ఇప్పుడు పాత్రల మీద ఎక్కువ దృష్టి పెడుతోంది. కేవలం కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా కథలో తన పాత్రకు ప్రాముఖ్యత, పాత్రలో నటించేందుకు ఆస్కారం ఉండాలని కోరుకుంటోంది.

ఆ ఉద్దశ్యంతో ఆమె చేసిన కొత్త చిత్రం ‘సీత’. తేజ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మే 24న విడుదలకానుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్స్ బట్టి చూస్తే కథకు కాజల్ పాత్ర చాలా ముఖ్యమని తెలుస్తోంది. హీరో పాత్రతో పాటు ఆమె పాత్రలోని మంచి, చెడు కోణాలు కూడా కథకు మూలమని అర్థమవుతోంది. కాజల్ అయితే ఈ క్యారెక్టర్ తనకు కొత్త ఇమేజ్ ఇస్తుందని ఆశిస్తోంది. నిర్మాతలు సైతం ఈ చిత్రం జెండర్ స్టీరియోటైప్స్ థియరీని మారుస్తుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More