రిస్క్ చేసేందుకు రెడీ అయిపోయిన కాజల్..!

Published on Jul 11, 2021 3:57 am IST

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ చందమామ వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా ప్లాన్‌ చేసుకుంటూ ముందుకెళ్తుంది. అయితే ఇప్పటివరకి గ్లామర్ పాత్రలే చేసిన కాజల్ అగర్వాల్ తాజాగా రిస్క్ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఓ తమిళ సినిమాలో తల్లి పాత్రలో నటించేందుకు కాజల్‌ ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొత్తం తల్లీకూతుళ్ల సెంటిమెంట్ పైనే నడుస్తుందని అయితే కథ కాస్త కొత్తగా అనిపించడంతో కాజల్ కూడా అందుకు టక్కున ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోశించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్‌ ‘ఆచార్య’, ‘ఇండియన్‌-2’ సినిమాల్లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :