టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ విగ్రహం

Published on Dec 17, 2019 2:23 pm IST

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అరుదైన ఘటనతను దక్కించుకుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నందు ఆమె మైనపు విగ్రహం త్వరలో ఆవిష్కృతం కానుంది. ఈమేరకు మ్యూజియం నిర్వాహకులు ఆమెను సంప్రదించి విగ్రహానికి కావాల్సిన కొలతలను తీసుకోవడం జరిగింది. దక్షిణాది నుండి టుస్సాడ్స్ మ్యూజియం నందు మైనపు విగ్రహం కలిగిన మొదటి నటిగా కాజల్ అగర్వాలే కావడం విశేషం.

ఫిబ్రవరి 5వ తేదీన సింగపూర్ నందుగల మ్యూజియమ్ నందు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సంధర్భంగా కాజల్ చిన్నప్పుడు టుస్సాడ్స్ మ్యూజియంలోని నటీనటుల విగ్రహాలు చూసి సంభరపడేదాన్ని.. అలాంటిది ఇప్పుడు అదే మ్యూజియంలో నా విగ్రహం ఉండబోతుండటం చాలా సంబరంగా ఉంది అంటూ ఇం గ్రామ్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :