ఆసక్తి రేపుతున్న కాజల్ అగర్వాల్, జయంరవి “కోమలి” పోస్టర్

Published on May 18, 2019 12:04 pm IST

బ్యూటీ కాజల్ అగర్వాల్, జయంరవి హీరో హీరోయిన్లుగా తమిళ్లో తెరకెక్కుతున్న మూవీ “కోమలి”. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఫోస్టర్ చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. చేతికి సెలైన్, పేషెంట్ గెట్ అప్ లో ఉన్న జయం రవి తికమక పడుతున్న ముఖ చిత్రంతో ఉన్న పోస్టర్ ఆసక్తిని రేపుతోంది. పోస్టర్ బ్యాగ్రౌండ్ లో సామజిక మాధ్యమాలకు సంబందించిన గుర్తులు ఉండటంతో ఇది సామజిక మాధ్యమాలపై వస్తున్న సెటైరికల్ మూవీ అనిపిస్తుంది.

నేటి యువత ఎంత ధారుణంగా సామజిక మాధ్యమాలకు బానిసలైపోయారో, మనకు తెలియకుండా అవి మన జీవితం పై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తెలియజేసే ప్రయత్నం చేస్తారోమో అనిపిస్తుంది. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కొత్త దర్శకుడు ప్రదీప్ తెరకెక్కిస్తున్నారు. హిప్ హాప్ తామిజ్ సంగీతం స్వరపరిచారు.

సంబంధిత సమాచారం :

More