అది లేకుండా ఉండలేనంటున్న కాజల్

kajal-agarwal
ప్రతి ఒక్క హీరోయిన్ కి స్వతహాగా ఏదో ఒక సరికొత్త అలవాటు ఉంటుంది, దాన్ని కొంతమంది బయటకి చెప్పుకుంటే కొంతమంది మాత్రం బయటకి చెప్పరు. కొంతమంది డిఫరెంట్ ఫుడ్స్ పై ఆసక్తి చూపితే కొంతమంది యోగపై ఆసక్తి చూపుతారు. కానీ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం దానికి భిన్నంగా మరో కొత్త అలవాటు చెబుతోంది.

ఈ అందాల భామ ఏం చేసినా పర్లేదు కానీ రోజుకి 8 గంటలు నిద్ర లేకపోతే మాత్రం నేను బతకడం చాలా కష్టం అంటోంది. ఎప్పుడు చాన్స్ దొరికినా ఎక్కువగా నిద్రపోవడానికే ఇష్టపడుతానని కాజల్ అంటోంది. ‘నిద్ర లేకుండా నేను అస్సలు జీవించలేను. అలాగే హీరోయిన్స్ వాళ్ళు ఏమి కావాలనుకుంటే అది తినలేరని’ కాజల్ అంటోంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రసతుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version