విక్రమ్‌తో సినిమా అంటే చాలా హ్యాపీగా ఉంది : కాజల్

Kajal-Aggarwal-and-Vikram

తెలుగులో స్టార్లందరితోనూ ఆడిపాడిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు తమిళ సినిమాలతో దూసుకుపోతోంది. కాజల్ హీరోయిన్‌గా ప్రస్తుతం మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో రెండు ధనుష్, విశాల్‌ల సినిమాలు కాగా మూడోది విక్రమ్‌ సినిమా. మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ విక్రమ్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, ప్రియా ఆనంద్‌లు నటించనున్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్ తనకు రావడం పట్ల కాజల్ ఆనందం వ్యక్తం చేసింది.

విక్రమ్ ఒక అద్భుతమైన నటుడని, ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని కాజల్ తెలిపింది. ‘ఐ’ సినిమా ద్వారా తానెంటో మరొకసారి ప్రూవ్ చేసుకున్న విక్రమ్, ఇకపై వరుస సినిమాలు చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా ఇప్పుడీ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ సినిమా విజయవంతమైతే.. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల స్టార్లతో విజయాలు నమోదు చేసుకున్న తారగా మరో మెట్టు ఎక్కాలని కాజల్ భావిస్తోంది.

Exit mobile version