గోవా లో ఎంజాయ్ చేస్తున్న చందమామ

Published on Dec 9, 2019 4:31 pm IST

చందమామ కాజల్ కి టాలీవుడ్ లో ఈఏడాది కలిసి రాలేదు. ఆమె తెలుగులో చేసిన రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. తేజ దర్శకత్వంలో వచ్చిన సీత చిత్రంపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. హీరో సాయి శ్రీనివాస్ పాత్రకు మించిన ప్రాధాన్యత ఆమె సీత చిత్రంలో దక్కించుకున్నారు. ఇక శర్వానంద్ హీరోగా వచ్చిన రణరంగం చిత్రం కూడా అనుకున్నంత విజయం దక్కించుకోలేక పోయింది. ఐతే కాజల్ తమిళంలో నటించిన కోమలి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో కాజల్ కి ఇప్పుడు అనుకున్నంతగా అవకాశాలు లేవు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో ఆమె నటిస్తున్నారు.

ఇక తమిళంలో పారిస్ పారిస్, హిందీలో ఓ చిత్రం చేస్తున్నట్లు సమాచారం. కాగా తాను ప్రస్తుతం గోవాలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుందిట. తన మిత్రులతో సంతోషంగా గడుపుతున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ నందు పంచుకున్నారు. ఓ ఫ్రెండ్ మ్యారేజ్ కొరకు కాజల్ గోవా వెళ్లినట్టు సమాచారం. కాజల్ తన మిత్రులతో ఆహ్లాదంగా గడుపుతున్న ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :

More