కోర్టులో కేసు ఓడిపోయిన కాజల్ అగర్వాల్ !
Published on Aug 9, 2017 4:16 pm IST


కాజల్ గర్వాల్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె వేసిన కేసు పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే కాజల్ 2008 లో ఒక కోకోనట్ హెయిర్ ఆయిల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. కానీ తనకు, ఆ కంపెనీకి మధ్య కాంట్రాక్ట్ గడువు ముగిసినా కూడా వారు ఆ ప్రకటనను వాడుకుంటున్నారని, అది భావ్యం కాదని, అందుకుగాను తనకు పరిహారం చెల్లించాలని కేసు వేసింది.

ఈ కేసును మద్రాస్ హైకోర్టు ఈరోజు విచారించగా సదరు కంపెనీ తరపు లాయర్ కాంట్రాక్ట్ ముగిసినా కూడా కాపీ రైట్స్ చట్టం ప్రకారం ప్రకటనను 60 ఏళ్ల పాటు వాడుకోవచ్చని విన్నవించారు. ఆయన వాదనలు విన్న కోర్టు కాజల్ పిటిషన్లో బలంలేదని కేసును కొట్టివేసింది. అంతేగాక కేసు విచారణ నిమిత్తం కంపెనీ భరించిన ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

 
Like us on Facebook