
ఈ ఏడాది ‘టెంపర్’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్ తాజాగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ హ్సుసింది. అవే పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’. ఇంకా షూట్ స్టార్ కాని ‘బ్రహ్మోత్సవం’ని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ ఇప్పటికే మొదలయ్యి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. అంతే కాకుండా నిన్నటి నుంచి మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
మాకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం కాజల్ అగర్వాల్ వచ్చే వారం నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో అడుగుపెట్టనుంది. అక్కడి నుంచి తను కూడా ఈ నెలాఖరు వరకూ షూటింగ్ లో పాల్గొననుంది. కాజల్ మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుండడంతో షూటింగ్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కాజల్ తో పాటు లక్ష్మీ రాయ్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా స్టెప్పులేయనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

