క్రియేటివ్ ఐడియాతో బిజినెస్‌ ఫీల్డ్‌లోకి కాజల్!

kajal-agarwal
తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ప్రధాన భాషల్లోనూ నటించి హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ను పొందిన కాజల్, ఆ స్టేటస్ అలా ఉండగానే క్రియేటివ్ ఐడియాతో కొత్తగా బిజినెస్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన మిత్రులతో కలిసి కాజల్ ఓ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను లాంచ్ చేసింది. కాజల్ అగర్వాల్ మొదలుపెట్టిన మొదటి బిజినెస్ ఇదే కావడం విశేషం.

బడ్డీస్ నేషన్ పేరుతో ప్రారంభమైన ఈ సోషల్ సైట్ ద్వారా ఎవ్వరైనా తమ బిజినెస్‌కు, ఆలోచనలకు దగ్గరైన వ్యక్తులతో అభిప్రాయాలు పంచుకోవచ్చు. కొత్తగా అవకాశాల కోసం, ఐడియాల కోసం వెతుక్కునే వారికి buddiesnation.com సరైన వేదిక అని కాజల్ తెలియజేసింది. ఇక ప్రస్తుతం కాజల్.. విశాల్, ధనుష్, విక్రమ్ సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌లతో పాటు కొత్తగా లాంచ్ చేసిన తన బిజినెస్ కార్యకలాపాల్లోనూ పాల్గొంటూ స్టార్ హీరోయిన్ అవ్వడంతో పాటు స్టా బిజినెస్ వుమెన్ కూడా అయ్యేందుకు కష్టపడుతోంది!

Exit mobile version