తెలుగులో ‘సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం’ హిందీలో ‘దో లాఫ్జోన్ కి కహాని’వంటి సినిమాలు పరాజయం పొందడంతో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన తరువాతి ద్విభాషా చిత్రం ‘కావలై వెండం’ పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ మధ్యే ఆడియో విడుదల జరుపుకున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను నవంబరు 24న విడుదల చేయనున్నారు.
ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు డి. వెంకటేష్ సమర్పిస్తున్నారు. డీకే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జీవ హీరోగా నటించాడు. ‘రంగం’ సినిమాతో జీవ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమవడంతో తెలుగులో సైతమ్ ఈ సినిమాకి మంచి ఆదరణ ఉంటుదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా కాకుండా కాజల్ చిరు 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’, అజిత్ 57వ చిత్రం, రానా – తేజ్ కాంబినేషన్లో వస్తున్నా ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
