అన్ స్టాప్పబుల్ రెస్పాన్స్ తో ‘కళావతి’ సెన్సేషన్..!

అన్ స్టాప్పబుల్ రెస్పాన్స్ తో ‘కళావతి’ సెన్సేషన్..!

Published on Feb 17, 2022 2:00 PM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల అదిరే ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి రిలీజ్ చేయడంతోనే ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యి నెవర్ బిఫోర్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంది.

ఆల్ టైం రికార్డు వ్యూస్ మరియు లైక్స్ తో ‘కళావతి’ సాంగ్ టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ రికార్డ్స్ అందుకోగా లేటెస్ట్ గా ఏకంగా 25 మిలియన్ వ్యూస్ మార్క్ ని ఈ సాంగ్ అందుకొని మరో రికార్డు సెట్ చేసింది. దీనితో ఈ సాంగ్ భారీ సక్సెస్ తో మేకర్స్ చాలా ఆనందంగా ఉన్నారట. అలాగే ఇంకో పక్క ఈ హిట్ ట్రాక్ కి మరో ఇంట్రెస్టింగ్ వెర్షన్ కూడా ఉన్నట్టు టీజ్ చేస్తున్నారు. మరి అదెప్పుడు వస్తుందో చూడాలి. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే మే 12న రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు