డిసెంబర్ 18 నుండి జనవరిలో కి మారిన “కళా పోషకులు” విడుదల

డిసెంబర్ 18 నుండి జనవరిలో కి మారిన “కళా పోషకులు” విడుదల

Published on Dec 17, 2020 3:00 PM IST

Kalaposhakulu

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు”. డిసెంబర్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం పరిపూర్ణంగా థియేటర్స్ ఓపెన్ కాని నేపథ్యంలో జనవరిలో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు..

చిత్ర నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… రీసెంట్ గా విడుదలైన మా కళాపోషకులు ట్రైలర్ కి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. రోజు రోజుకీ వ్యూస్ పెరిగిపోతున్నాయి. దీంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ముందు అనుకున్నట్టుగానే మా చిత్రాన్ని డిసెంబర్18న విడుదల చేయాలని ప్లాన్ చేశాం.. కానీ ఫుల్ ప్లేడ్జెడ్ గా థియేటర్స్ ఓపెన్ కాని కారణంగా ‘కళాపోషకులు’ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.. సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.. అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు