రొటీన్ కి భిన్నంగా ‘కల్కి’ ఫస్ట్ అవతార్ టీజర్ !

రొటీన్ కి భిన్నంగా ‘కల్కి’ ఫస్ట్ అవతార్ టీజర్ !

Published on Dec 31, 2018 3:21 PM IST

kalki3

‘గరుడ వేగ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ఫస్ట్ అవతార్ టీజర్ ను కొద్దీ సేపటికి క్రితమే చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ అవతార్ టీజర్ లో టైటిల్ ను హైలెట్ చేస్తూ ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇక ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

ఫస్ట్ అవతార్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

తాజా వార్తలు