‘కాలా’ టీజర్ డేట్ ఫిక్సైపోయింది !
Published on Feb 24, 2018 9:55 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ చిత్ర హడావుడి మొదలైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన దక్కగా టీమ్ టీజర్ ను రెడీ చేస్తోంది. ఈ టీజర్ను మార్చి 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. భారీ క్రేజ్ నడుమ వస్తున్న ఈ టీజర్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏప్రిల్ 27న విడుదలకానున్న ఈ సినిమాను ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ డైరెక్ట్ చేయగా రజనీ అల్లుడు ధనుష్ స్వయంగా తన వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది ఈ చిత్రం. దీని తరవాత ప్రతిష్టాత్మకమైన ‘2 పాయింట్ 0’ విడుదలవుతుండగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ఒక సినిమాకి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీ.

 
Like us on Facebook