మెగా అల్లుడు మరో చిత్రానికి రెడీ అవుతున్నాడా ?
Published on Jun 21, 2018 1:03 pm IST

మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్ తన మొదటి చిత్రం ‘విజేత’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . ఇక ఈ సినిమా విడుదలకు ముందే మరొ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కళ్యాణ్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతన్న ఆ సినిమాకి ‘వరప్రసాద్ గారి అల్లుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం . తన మొదటి సినిమా కు చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా టైటిల్ ను పెట్టుకున్న కళ్యాణ్ ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. చిరంజీవి గారి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ దాంతో ఆ పేరుతోనే ఈ చిత్ర టైటిల్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది .

ఇక కళ్యాణ్ దేవ్ నటించిన మొదటి చిత్రం విజేత ఫై మంచి అంచనాలే ఉన్నాయి ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకం ఫై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ కథానాయకిగా నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook