యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్న కళ్యాణ్ దేవ్..!

Published on Sep 2, 2021 8:54 pm IST


‘విజేత’ లాంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఎం కుమార‌స్వామి నాయుడు ద‌ర్శ‌కుడిగా, క‌థ కంచికి మ‌నం ఇంటికి లాంటి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని నిర్మించిన ఎం పి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మోనిష్ ప‌త్తిపాటి నిర్మాత‌గా, ద‌త్తి సురేష్ బాబు క్రియేటివ్ ప్రోడ్యూస‌ర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు కూక‌ట్‌ప‌ల్లి తుల‌సివ‌నంలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి టెంపుల్‌లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమాకు వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే తెలియచేయనుంది.

సంబంధిత సమాచారం :