డబ్బింగ్ మొదలుపెట్టిన చిరంజీవి అల్లుడు !
Published on May 17, 2018 11:56 am IST

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కళ్యాణ్ దేవ్ తన పాత్ర తాలూకు డబ్బింగ్ పనుల్ని ఈరోజు నుండి మొదలుపెట్టేశారు. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి హీరో సక్సెస్ అయిన నేపథ్యంలో చిరు అల్లుడి తెరంగేట్రం ఎలా ఉంటుందో చూడాలని మెగా అభిమానులు ఆశపడుతున్నారు.

రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుయిమర్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. మాళవిక నాయర్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్ వంటి నటులు పలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు

 
Like us on Facebook