‘నా నువ్వే’ లో నేను వేరు – కళ్యాణ్ రామ్

‘నా నువ్వే’ లో నేను వేరు – కళ్యాణ్ రామ్

Published on Jun 2, 2018 3:00 PM IST

‘నా నువ్వే’ సినిమాలో నేను వేరు అంటున్నారు కళ్యాణ్ రామ్. తన సినీ కెరీర్ లో మొదటిసారి చేస్తున్న పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. ఈ సినిమాలో తన లుక్స్, తన బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా ఉంటాయని, ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తాను వేరుగా ఉంటానని అంటున్నారు కళ్యాణ్ రామ్. చిత్ర బృందం కూడ ఇదే మాటను చెబుతోంది.

కళ్యాణ్ రామ్, తమన్నా కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ అవుతుంద౦టా. ప్రోమోల్లో కూడా ఇద్దరి జోడీ బాగుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పిసి. శ్రీరామ్ తీసిన విజువల్స్, జయేంద్ర డైరెక్షన్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయట. జూన్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు