బాలయ్య కోసం గెస్ట్ రోల్ లో కళ్యాణ్ రామ్ ?

Published on Nov 30, 2020 4:01 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా నుండి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని.. కళ్యాణ్ రామ్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే బోయపాటి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More