కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న అధికారికంగా ప్రకటించేశారు

Published on Jun 12, 2019 10:07 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి మూవీ ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ని అధికారికంగా నేడు చిత్ర యూనిట్ ప్రకటించింది. మ్యూజిక్ రంగంలో అగ్రగామి ఉన్న ఆదిత్య మ్యూజిక్ మొదటిసారిగా ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుంది. త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

‘ఎఫ్2’ బ్యూటీ మెహ్రీన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఈ మూవీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వరాలు గోపి సుందర్ సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More