యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం హైదరాబాద్లో ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ లో బిజీకానున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ ని ఫినిష్ చేసి ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా గత ఆదివారం లాంచనంగా ప్రారంభమైంది. జనవరి నుంచి షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా 2016 ఆగష్టు 12న రిలీజ్ అవుతుంది.
కొరటాల శివ తర్వాత చేసే ప్రాజెక్ట్ కి కూడా ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఆ సినిమా ద్వారా రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేయనున్నారని తెలిపాము. ఎన్.టి.ఆర్ – వక్కంతం వంశీ సినిమాని కళ్యాణ్ రామ్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటించనున్నాడు. ఈ సినిమా కథలో బాగా కీలకమైన ఓ పాత్ర ఉంది. ఆఅ పాత్రని కళ్యాణ్ రామ్ చేస్తే బాగుంటుందని వంశీ కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఆ పాత్రని డిజైన్ చేసాడట. ఆ రోల్ చేయడానికి కళ్యాణ్ రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీని ప్రకారం నందమూరి హీరోల మల్టీ స్టారర్ ని ఈ సినిమా ద్వారా చూడచ్చు.


