కళ్యాణ్ రామ్ తో విరించి వర్మ నిజమేనా ?

కళ్యాణ్ రామ్ తో విరించి వర్మ నిజమేనా ?

Published on Mar 2, 2019 3:45 AM IST

Kalyana Ram
కే వి గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘118’ చిత్రం ఈ రోజు మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా కళ్యాణ్ రామ్ తన తర్వాత సినిమాను ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తన రెండో సినిమాగా నానితో మజ్ను తీసి పర్వాలేదనిపించుకున్నాడు. కాగా ఇప్పుడు విరించి వర్మ నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసిననట్లు తెలుస్తోంది. మేలో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అయితే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రటకన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు