‘నాని’ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ ?

Published on Apr 29, 2019 4:53 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా ‘తుగ్లక్’. ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తన రెండో సినిమాగా నానితో మజ్ను తీసి పర్వాలేదనిపించుకున్నాడు ఈ డైరెక్టర్.

కాగా ఇప్పుడు విరించి వర్మ నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసిననట్లు తెలుస్తోంది. జులై నుండి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అయితే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రటకన రానుంది.

సంబంధిత సమాచారం :