
ఒక్క పాట మినహా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన షేర్ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుందని మేము ముందుగానే తెలిపాం. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ గీతాన్ని బ్యాంకాక్ మరియు పాటయా లో అందమైన లోకేషన్ల మధ్య చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాని దర్శకుడు మల్లికార్జున్ తెరకెక్కిస్తున్నాడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్. బ్రహ్మానందం, రావు రమేష్ ముఖ్యపాత్రధారులు. థమన్ సంగీత దర్శకుడు. ఒక పవర్ ఫుల్ అవతారంలో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు.

