కళ్యాణ్ రామ్ రహస్యంగా ఉంచిన ఆ విశేషాలు ఏంటో..

Published on May 27, 2021 12:56 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ ఈమధ్య కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించలేదు. ‘ఎంత మంచివాడవురా’ తర్వాత ఆయన కొత్త సినిమా విషయాలేవీ బయటకు రాలేదు. అలా అని కళ్యాణ్ రామ్ ఖాళీగా ఏమీ లేరు. సైలెంట్ గానే కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్లోనే విశేషమైన ప్రాజెక్ట్. పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ చిత్రం ఇది. సినిమా షూటింగ్ గతేడాదిలోనే మొదలైందట. కానీ సినిమాకు సంబంధించిన ఏ చిన్న డీటైల్ బయటకు రాకుండా బృందం జాగ్రత్త పడ్డారు.

ఇప్పుడు ఒక్కసారిగా విశేషాలను రివీల్ చేసేందుకు సిద్ధమయ్యారు. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి పుట్టినరోజైన మే 28న తేదీన సినిమా యొక్క టైటిల్ పోస్టర్ రివీల్ చేయనున్నారు. ఆరోజునే చిత్ర దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు తెలియనున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు కథ ఒక టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్ అని మాత్రమే తెలుస్తోంది. మిగతా రహస్యాలు తెలియాలంటే మే 28 వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ మీదనే నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :