ఒకే సారి రెండు సినిమాలతో బిజీ కానున్న కళ్యాణ్ రామ్ !

Published on Mar 1, 2019 1:57 am IST


నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 118 రేపు విడుదలకానుంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫై భారీ ఆశలే పెటుకున్నాడు ఈ హీరో. ఇక ఈ చిత్రం తరువాత ఒకే సారి రెండు చిత్రాలను మొదలుపెట్టనున్నాడు కళ్యాణ్ రామ్. అందులో భాగంగా లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ తో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం తర్వలోనే లాంఛ్ కానుంది.

ఇక ఈచిత్రం తోపాటు కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు వశిష్ఠ చెప్పిన కథ కు ఓకే చెప్పాడట. ప్రస్తుతం చర్చల దశలో వున్నా ఈ ప్రాజెక్ట్ ఫై తర్వలోనే ఓ క్లారిటీ రానుంది. దాదాపుగా ఈ రెండు సినిమాలను ఒకేసారిసెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల కంటే ముందు కళ్యాణ్ రామ్ ,’ఉయ్యాలా జంపాల’ ఫేమ్ విరించి వర్మ తో సినిమా చేయనున్నాడని టాక్ వచ్చింది. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :