తెలుగు ఆడియెన్స్ పై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్.!

Published on Jun 1, 2022 11:01 am IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్” భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేసి చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరి ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న మన తెలుగులో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా చిత్ర యూనిట్ తో పాటు కమల్ అలాగే హీరోలు వెంకటేష్ మరియు నితిన్ లు స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమంలో కమల్ తెలుగు ఆడియెన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. తాను తమిళ్ లో ఎన్నో సినిమాలు చేస్తే కొన్ని హిట్ అయ్యాయని కానీ నేను తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ హిట్స్ ని తెలుగు ఆడియెన్స్ అందించారని ఆ ప్రేమను నేనెప్పటికీ మర్చిపోను అని కమల్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనితో ఈ కామెంట్స్ మంచి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :