ఉత్తమ విలన్ బాధితులను ఆదుకోనున్న కమల్

kamal-hassan
కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ విడుదలకు ముందు ఎన్నో పురిటినెప్పులను ఎదుర్కుని చివరికి అతికష్టంమీద విడుదలై భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసినదే. ఈ సినిమాకి తిరుపతి బ్రదర్స్ సహనిర్మాతలు కావడంతో వారు భారీగా నష్టపోయారు.

ఈ నష్టాన్ని కొంతమేరకు పూడ్చే క్రమంలో కమల్ తన తదుపరి చిత్ర పంపిణీ హక్కులను తిరుపతి బ్రదర్స్ కి ఇవ్వనున్నట్టు సమాచారం. తుంగవనం పేరుతొ తమిళ్ లో, చీకటి రాజ్యం టైటిల్ తో తెలుగులో ఈ సినిమా విడుదలకానుంది. ప్రకాష్ రాజ్, త్రిష లు ముఖ్యపాత్రధారులు. కమల్ హాసన్ సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణమవుతుంది.

Exit mobile version