శ్రీదేవి కోసం కథ రెడీ చేస్తున్న కమల్ హాసన్

శ్రీదేవి కోసం కథ రెడీ చేస్తున్న కమల్ హాసన్

Published on Nov 4, 2014 7:53 PM IST

kamal-haasan
ఒకరేమో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, మరొకరేమో ఇండియన్ ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియన్స్ కి కన్నుల పండుగానే చెప్పాలి. 1980లలో కమల్ హాసన్ – శ్రీదేవి కాంబినేషన్ లో 20కి పైగా సినిమాలు వచ్చాయి. దాదాపు ఆ సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ని రిపీట్ చెయ్యాలనే ఆలోచనలో కమల్ హాసన్ ఉన్నాడు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ శ్రీదేవి – తను కలిసి నటించడానికి సరిపోయేలా ఓ కథని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో కమల్ బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ మొత్తం పూర్తయిన తర్వాత కమల్ హాసన్ శ్రీదేవిని కలవనున్నాడు. ఆ కథకి శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే సంవత్సరం వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశం’ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలను వరుసగా వచ్చే సంవత్సరం మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు