గురు భక్తి చాటుకున్న కమల్ హాసన్

గురు భక్తి చాటుకున్న కమల్ హాసన్

Published on Nov 8, 2019 10:57 AM IST

నిన్న లోకనాయకుడు కమల్ హాసన్ తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. అలాగే కమల్ నటుడిగా తెరంగేట్రం చేసి 60ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ళ ప్రాయంలోనే వెండి తెరపై కనిపించిన కమల్ హాసన్ మొదటి చిత్రం కాలాతూర్ కన్నమ్మ చిత్రంలో నటనకు గాను రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నారు. కాగా తమిళ లెజెండరీ దర్శకుడు కె బాలచందర్ కమల్ హాసన్ ను మొదటిసారి హీరోగా పరిచయం చేశారు. వీరి కాంబినేషన్లో అపూర్వ రాగంగళ్, మరో చరిత్ర, అందమైన అనుభవం, ఆకలి రాజ్యం, అంతులేని కథ వంటి క్లాసికల్ హిట్స్ వచ్చాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం పరవశం.

కాగా తన పుట్టినరోజుని పురస్కరించుకొని కమల్ తన గురువుగారైన స్వర్గీయ బాలచందర్ గౌరవార్థం ఆయన విగ్రహాన్ని నేడు ప్రతిష్టించారు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నూతన భవనం ఎదురుగా బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో రజిని కాంత్ కూడా పాల్గొన్నారు. అలాగే గాంధీజీ 150వ జయంతి సందర్భంగా కమల్ హాసన్ నటించిన హే రామ్ మూవీ ప్రదర్శించనున్నారు. ఇక కమల్ హాసన్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు