“విక్రమ్” లో సూర్య రోల్ పై కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jun 2, 2022 5:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మరికొందరు స్టార్ నటులు విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు నటించారు. ఈ క్యాస్టింగ్ తోనే భారీ హైప్ తెచ్చుకున్నా ఈ చిత్రం పై లాస్ట్ చేసి మేకర్స్ మరో స్టార్ హీరో సూర్య కూడా ఉన్నాడని చెప్పి నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లారు.

దీనితో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ సూర్య రోల్ పై మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో సూర్య చేసిన రోల్ చాలా స్పెషల్ గా ఉంటుంది అని అంతే కాకుండా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని తెలిపారు. ఈ కీలక రోల్ కోసం సూర్య కి కాల్ చేసి అడగ్గా వెంటనే ఓకే చెప్పాడని కమల్ తెలిపారు. మరి వీరు చెబుతున్న ఈ ఇంట్రెస్టింగ్ రోల్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :