ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ దిశగా “విక్రమ్”.!

Published on Jun 19, 2022 12:00 am IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అలాగే స్టార్ హీరో సూర్య కీలక పాత్రలో ఫహద్ ఫాజిల్ మరో పాత్రలో నటించిన ఇండియాస్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “విక్రమ్”. ఈ చిత్రం కమల్ కెరీర్ లోనే ఒక భారీ హిట్ గా నిలవడమే కాకుండా తమిళ నాట భారీ స్థాయి రికార్డులను అందుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా 300 కోట్లకి పైగా వసూళ్లను అందుకున్న ఈ చిత్రం తమిళ నాడులో అయితే “బాహుబలి 2” ని క్రాస్ చేసి 75 కోట్లకి పైగా షేర్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచే దిశగా కొనసాగుతున్నట్టు తమిళ సినీ వర్గాలు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాయి.

ఒక్క తమిళ్ లోనే ఈ చిత్రం 150 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంటుండగా డెఫినెట్ గా తమిళ నాట ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవబోతున్నట్టు తెలుస్తుంది. బాహుబలి 2 లైఫ్ టైం వసూళ్ళని ఈ రెండు రోజుల్లో క్రాస్ చేసేసి కట్ట రికార్డులని అయితే విక్రమ్ సెట్ చేయబోతున్నట్టుగా హాట్ టాపిక్. మొత్తానికి అయితే కమల్ కం బ్యాక్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :