వెంకీ పేరుని సూచించిన కమల్

వెంకీ పేరుని సూచించిన కమల్

Published on Jun 14, 2014 3:35 AM IST

kamalhasn_venkatesh
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ఆ నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపించారు. అయితే మలయాళంలో మోహన్ లాల్ లాంటి టాప్ స్టార్ పోషించిన పాత్రని తెలుగులో పోషించే నటుడి కోసం నిర్మాతలు ఎంతగానో అన్వేషించారు.

చివరికి ఆ పాత్ర విక్టరీ వెంకటేష్ ని వరించింది. వెంకటేష్ పేరుని నిర్మాతలకి సూచించింది మరెవరో కాదు. తమిళ్ యూనివర్సల్ స్టార్ కమల్ హసన్. ఈ విషయం ఈరోజు ఏర్పాటు చేసిన ‘దృశ్యం’ ప్రత్యేక సమావేశంలో నిర్మాతలు వెల్లడించారు.

షూటింగ్ ని పూర్తిచేసుకున్న ‘దృశ్యం’ జూలైలో విడుదల కానుంది. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో వెంకటేష్ మీనా జంటగా నటించారు.

తాజా వార్తలు