కమల్ పై చెప్పులు విసిరిన దుండగులు

Published on May 16, 2019 11:09 am IST

కమల్ హాసన్ చేసిన హిందూత్వ తీవ్రవాద వ్యాఖ్యలతో రేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. బుధవారం ప్రచారంలో భాగంగా తిరుప్పరంకుండ్రం అసెంబ్లీ కాన్స్టిటెన్సీ ప్రాంతంలో ఓ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు దుండగులు ఆయనపై చెప్పులు వేసి తమ నిరసన తెలిపారు. ఈ పరిణామంతో కమల్ తన ప్రసంగాన్ని ఆపివేయవలసి వచ్చింది.

స్వతంత్ర భారతం లో మొదటి తీవ్రవాది గాంధీ ని చంపిన హిందువు అయిన గాడ్సే అని కమల్ మాట్లాడటం మనకు తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అన్నివర్గాలనుండి తీవ్ర నిరసనలు రేకెత్తాయి. ఐతే ఇంత జరుగుతున్న కమల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా, తాను జరిగిన ఓ చారిత్రక సంఘటన గురించే మాట్లాడానని, తనని తాను సమర్ధించుకోవడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More