
మరో రెండు రోజుల్లో చీకటి రాజ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకుల అలరించేందుకు సిద్ధమైన కమల్ హాసన్, ఈ సినిమా రిలీజ్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్ ‘తూంగవనం’ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నేపథ్యంలో చీకటి రాజ్యం విషయంలో రిలీజ్‌కి ముందే పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ చేయనున్న కొత్త సినిమా విషయంలో ఆసక్తికర విషయం ఒకటి తెలుస్తోంది.
చీకటి రాజ్యం సినిమాను రెండు భాషల్లో కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసిన కమల్, తన తదుపరి సినిమాను వీలైనంత తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. మళయాలం, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందే తన నెక్స్ట్ సినిమాను కమల్ కేవలం 50 రోజుల్లో పూర్తి చేయనున్నారట. అమెరికా, జార్జియాల్లో మెజారిటీ పార్ట్ షూటింగ్ జరుపుకునే ఈ సినిమాకు టి. కె. రాజీవ్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమాలో అమల ఓ ప్రధాన పాత్రలో నటించనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

