‘బాహుబలి రైటర్’ కథ కోసం.. కంగనా రనౌత్ !

‘బాహుబలి రైటర్’ కథ కోసం.. కంగనా రనౌత్ !

Published on Mar 26, 2019 12:09 PM IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది.

కాగా కంగనాకు తమిళంలో ఇదే మొదటి సినిమా. దాంతో ఆమె సినిమా కోసం తమిళం నేర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. జయలలిత బయోపిక్స్ లో భారీ బడ్జెక్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో ఈ చిత్రం పై కంగనా ప్రత్యేక శ్రద్ద తీసుకోనుంది.

ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఎలా నటిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు