ప్యాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కన్నడ దర్శకుడు ప్రేమ్..!

Published on Aug 10, 2021 12:00 am IST

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో “జోగి”, “రాజ్ ద షో మ్యాన్”, “ద విలన్” వంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ప్రేమ్ గాయకుడిగా, గీత రచయితగా మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా శాండల్ వుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రేమ్ దర్శకత్వంలో మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రం రాబోతుంది. ‘పీ9’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

విభిన్న కథలతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్, ప్యాన్ ఇండియా సినిమా ‘పీ9’ రూపొందిస్తుండటం చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. ఈ సందర్భంగా స్నీక్ పీక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఛక్రదారి అయిన శ్రీకృష్ణుడు యుద్ధానికి సన్నద్ధమవుతూ భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం :