అల్లు శిరీష్ సినిమాకి కన్నడ సంగీత దర్శకుడు !

Published on May 28, 2018 4:43 pm IST

అల్లు శిరీష్ ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘ఏబిసిడి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి ( అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) చిత్రానికి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. ఫ్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ఆరంభంకానుంది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కన్నడ కంపోజర్ జుడా శాండీని చూజ్ చేసుకున్నారు శిరీష్. ఎన్నాళ్ళ నుండో కొత్త తరహా సంగీతాన్ని తెలుగు వాళ్లకి పరిచయం చేయాలని అనుకుంటున్న తాను శాండీ మ్యూజిక్ ఆల్బమ్స్ విని అవి నచ్చడంతో ఆయన్ను సినిమాలోకి తీసుకున్నట్లు శిరీష్ మీడియాకు తెలిపారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :