అక్కడ తగ్గేదే లే అంటున్న కాంతార…భారీ వసూళ్లు!

అక్కడ తగ్గేదే లే అంటున్న కాంతార…భారీ వసూళ్లు!

Published on Nov 7, 2022 2:59 PM IST

రిషబ్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం కన్నడ లో మాత్రమే కాకుండా, ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం హిందీ వసూళ్లు ఇప్పటికే కేజీఎఫ్1 ను క్రాస్ చేయడం జరిగింది. నిన్న ఆదివారం కావడం తో హిందీ లో భారీ గా వసూళ్లు రాబట్టింది. ఆదివారం 4.5 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో అక్కడ ఇప్పటి వరకూ 62.40 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది.

ఈ చిత్రం దూకుడు ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. బాలీవుడ్ సినిమాలో రిలీజ్ అవుతున్నా, ఈ తరహాలో వసూళ్లు రాబట్టడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించగా, హీరో రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు