పెళ్లి చేసుకున్న స్టార్ కమెడియన్ !

పెళ్లి చేసుకున్న స్టార్ కమెడియన్ !

Published on Dec 13, 2018 4:24 PM IST

స్టార్ కమెడియన్ నిన్నటితో ఓ ఇంటివాడయ్యాడు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కామెడీ షోతో నవ్వులు పూయించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న కపిల్ శర్మ నిన్న వివాహం చేసుకున్నారు.

కాగా కపిల్ శర్మ చాలా కాలంగా గిన్నీ ఛత్రాత్ ను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమికులు ఇద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. వీరి వివాహ వేడుక జలంధర్ లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరై వదువరులను ఆశర్వదించారు.

ఇక కపిల్ శర్మ ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతోనే కమెడియన్ గా మంచి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ మధ్య ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే చిత్రం నిర్మాణంలో కూడా పాలు పంచుకొని నిర్మాతగా కూడా మారడు ఈ స్టార్ కమెడియన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు