కరణ్ జోహార్ సరికొత్త చిత్రం “రాకి ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ”

Published on Jul 6, 2021 3:35 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో లతో వరుస సినిమాలు చేసే కరణ్ జోహార్ మరొకసారి ప్రేమ కథా చిత్రం ను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యారు. కరణ్ జోహార్ దర్శకత్వం లో రణ్ వీర్ సింగ్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాకి ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ. ఈ చిత్రం ను నేడు అధికారికంగా ప్రకటించారు కరణ్ జోహార్. అయితే ఈ చిత్రం ప్రేమ కథ అంటూ చెప్పుకొచ్చారు. అయితే రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది అని తెలిపారు కరణ్ జోహార్.

అయితే ఈ చిత్రం లో హీరో హీరోయిన్ ల ను ప్రకటించిన చిత్ర యూనిట్, మిగతా నటీనటులను త్వరలో ప్రకటించనుంది. అయితే ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు వియాకాం 18 స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే ఇషితా మోయిత్రా, శశాంక్ కైతాన్, సుమిత్ రాయ్ అందిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :