విజయ్ దేవరకొండ ‘ఫైటర్‌’ కోసం కరణ్ జోహార్ కూడా !

Published on Dec 9, 2019 5:13 pm IST

విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో పరిచయం చేసే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో రాబోతున్న ‘ఫైటర్‌’ మూవీతోనే ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.

కాగా ఫైటర్ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. పూరి నిర్మాణ భాగస్వామి ఛార్మి కౌర్ ఈ రోజు ముంబైలో కరణ్ జోహర్‌ తో ఫైటర్‌ ను పాన్ ఇండియన్ మూవీగా తీర్చిదిద్దే ప్రతిపాదనతోనే చర్చ జరిపారట. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రం 2020 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరణ్ జోహార్ త్వరలో నిర్మాతల్లో ఒకరి అని త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం :

More